షారుఖ్ కొడుకు కేసును దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారులపై వేటు

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గోవా సమీపంలో సముద్రంలో క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ తో పాటు పలువురిని గతంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది గాంధీ జయంతి రోజున డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ఇరుక్కున్నాడు. ఈ కేసును ఎన్సీబీ దర్యాప్తు చేస్తోంది. 

మరోవైపు, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. అనుమానాస్పదమైన వ్యవహారాలను నడుపుతున్నందుకే వీరిపై వేటు పడినట్టు చెపుతున్నారు. అయితే, ఏ కేసులో వీరు సస్పెండ్ అయ్యారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఆర్యన్ ఖాన్ కేసులోనే వీరు అనుమానాస్పద చర్యలకు పాల్పడ్డారా? అనే చర్చ కూడా జరుగుతోంది.

Shahrukh Khan
Son
Aryan Khan
NCB
Officers
Suspention

More Telugu News